Rashmika Mandanna: సినీ నటి రష్మికతో డేటింగ్ అంటూ వార్తలు.. అసహనం వ్యక్తం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda Srinivas responds dating rumors with Rashmika
  • హిందీ ‘ఛత్రపతి’ సినిమాలో నటిస్తున్న శ్రీనివాస్
  • రష్మిక, తాను మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టీకరణ
  • ఎయిర్‌పోర్టులో కలిసి కనిపిస్తే అలా రాసేస్తారా? అంటూ ఆగ్రహం

ప్రముఖ నటి రష్మిక మందన్నతో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పందించారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి వార్తలు ఎలా సృష్టిస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రభాస్ చేసిన ‘ఛత్రపతి’ సినిమాను వీవీ వినాయక్ దర్శకత్వంలో హిందీలో రూపొందిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. 

సినిమా ప్రచారంలో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస్ డేటింగ్ వార్తలపై స్పందించారు. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు. రష్మిక, తాను మంచి స్నేహితులం మాత్రమేనని అన్నారు. షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు విమానాశ్రయంలో కలుసుకుంటూ ఉంటామని, అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు తక్కువేనని పేర్కొన్నారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా? అని ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మవద్దని కోరారు.

  • Loading...

More Telugu News