KTR: హైదరాబాద్ లో త్వరలోనే వార్డుల పాలన: కేటీఆర్

  • జీహెచ్ఎంసీలోని 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నామన్న కేటీఆర్
  • ప్రతి వార్డు కార్యాలయంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని వెల్లడి
  • సిటిజెన్ ఫ్రెండ్లీగా వార్డు కార్యాలయాలు ఉంటాయన్న మంత్రి
Wards offices in Hyderabad soon says KTR

తెలంగాణ ప్రభుత్వం పాలనలో కీలక సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. హైదరాబాదులో వార్డుల పాలనా పద్ధతిని తీసుకురాబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. వార్డు కార్యాలయంలో 10 మంది అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంఛార్జీగా ఉంటారని తెలిపారు. సిటిజెన్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ఉంటాయని చెప్పారు. ప్రతి వార్డు కార్యాలయం మరో వార్డు కార్యాలయంతో అనుసంధానం అవుతాయని అన్నారు. పాలన వికేంద్రీకరణతో పౌరులకు వేగంగా పరిపాలన ఫలితాలు అందుతాయని చెప్పారు.

More Telugu News