Telangana ECET: తెలంగాణ ఈసెట్ గడువు 3 రోజులు పొడిగింపు

  • మే 5 తో ముగియనున్నదరఖాస్తు గడువు
  • తాజా పెంపుతో మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
  • ఆలస్య రుసుముతో మే 12 వరకు అవకాశం
Telangana Ecet application date Extended to may 8

తెలంగాణలోని ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 5వ తేదీతో ముగియనున్న గడువును 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈసెట్ కన్వీనర్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈసెట్ దరఖాస్తుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, ఇతర కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ.900 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కన్వీనర్ తెలిపారు. ఆలస్య రుసుము రూ.2,500 చెల్లించి ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించినట్లు కన్వీనర్ ఆచార్య శ్రీరాం వెంకటేశ్ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 15న హాల్ టికెట్లు జారీ చేసి, 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ నిర్వహిస్తామని వెల్లడించారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్‌, బీఎస్‌సీ మ్యాథ్స్‌ పూర్తిచేసిన విద్యార్థులు నేరుగా బీటెక్‌, బీఫార్మసీలో చేరేందుకు ఏటా ఈసెట్‌ను నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ తెలిపారు.

More Telugu News