PM Modi: పెద్దయ్యాక ఏమవుతావని అడిగిన ప్రధాని.. 'మీకు సెక్రెటరీని అవుతా'నన్న బాలుడు!

Dont You Want To Become Prime Minister PM Interacts With Children
  • కలబుర్గీలో రోడ్ షో సందర్భంగా పిల్లలతో ముచ్చటించిన మోదీ
  • బాగా చదువుకుని పోలీస్, డాక్టర్ అవుతామన్న కొందరు చిన్నారులు
  • దేశానికి ప్రధాన మంత్రి కావాలని మీలో ఎవరికీ లేదా? అని ప్రశ్నించిన మోదీ
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కలబుర్గీలో పర్యటించారు. రోడ్ షోలో పాల్గొనేందుకు వెళుతుండగా ప్రధాని మోదీని చూసి అక్కడున్న చిన్నారులు సంతోషంతో కేకలు వేశారు. అది గమనించిన ప్రధాని.. ఆ పిల్లల దగ్గరికి వెళ్లి కాసేపు ముచ్చటించారు. అందరూ స్కూలుకు వెళుతున్నారా? బాగా చదువుకుంటున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. 

ఈ క్రమంలో పెద్దయ్యాక ఏమవుతారంటూ మోదీ ప్రశ్నించగా.. పోలీస్ అవుతానని ఒకరు, డాక్టర్ అవుతానని మరొకరు జవాబిచ్చారు. మరో అబ్బాయి మాత్రం పెద్దయ్యాక మీకు సెక్రెటరీని అవుతానని చెప్పడంతో ప్రధాని ఒక్కసారిగా నవ్వేశారు.

మీలో ఎవరికీ ప్రధానమంత్రి కావాలని లేదా? అని మోదీ వారిని ప్రశ్నించారు. కొంతమంది పిల్లలు మీలా అవుతామని బదులిచ్చారు. అనంతరం పిల్లలకు బై బై చెబుతూ మోదీ అక్కడి నుంచి రోడ్ షో లో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. 

కలబుర్గీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రధానిని చూసేందుకు జనం రోడ్ల పక్కన బారులుతీరి నిలుచున్నారు. పూలు చల్లుతూ మోదీకి స్వాగతం పలికారు. రోడ్ షో సందర్భంగా ట్రక్ పైన నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు సాగారు.
PM Modi
Karnataka
assembly election
BJP
kalaburigi
election campaign
Modi with kids

More Telugu News