Karnataka: కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యే కావాలంటున్న కర్ణాటక.. తాజా సర్వేలో వెల్లడి

  • రెండో స్థానంలో బస్వరాజ్ బొమ్మై
  • ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటేసే వారు 4 % మంది మాత్రమే
  • 56 శాతం మంది పార్టీని చూసే ఓటు వేస్తారట
  • ఎన్డీటీవీ-లోక్ నీతి సర్వేలో వెల్లడి
Siddaramaiah Most Popular Choice For Karnataka Chief Minister NDTV Survey

కొత్త ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది? అని అడిగితే కర్ణాటక ఓటర్లు సిద్ధరామయ్యే మా ఛాయిస్ అంటున్నారు. మెజారిటీ ప్రజలు ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బస్వరాజ్ బొమ్మై నిలిచారు. పాత తరం ఓటర్లు సిద్ధరామయ్యకు జైకొట్టగా.. యువతరం మాత్రం బొమ్మైని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు. ఈమేరకు లోక్ నీతి సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్) తో కలిసి ఎన్డీటీవీ నిర్వహించిన ఓ సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పార్టీ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్ కు ఓటర్లు నాలుగో స్థానాన్ని కట్టబెట్టారు. మూడో స్థానంలో జేడీఎస్ చీఫ్ హెచ్ డి కుమారస్వామి ఉన్నారు. ఇక నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన యడియూరప్ప ఈ సర్వేలో ఐదో స్థానంలో నిలిచారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చూసి ఓటేస్తామనే వారి సంఖ్య కేవలం 4 శాతం మాత్రమేనని సర్వే తేల్చింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని చూసి ఓటు వేస్తామని చెబుతున్న వారు 56 శాతం మంది ఉండగా.. ఓటు వేసే ముందు అభ్యర్థి ఎవరన్నది చూస్తామని 38 శాతం మంది అంటున్నారు. మరోవైపు, వొక్కలిగల ఓట్లు కాంగ్రెస్ (34 శాతం), జేడీఎస్ (36 శాతం) ల మధ్య చీలిపోతాయని, లింగాయత్ లు మాత్రం బీజేపీ (67 శాతం) తోనే ఉంటారని ముస్లిం కమ్యూనిటీ (59 శాతం) కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని సర్వే వెల్లడించింది.

సర్వేలో వెల్లడైన ఇతర వివరాలు..

  • అవినీతి: ఈ విషయంలో బీజేపీ ముందు ఉందని 59 % మంది, కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అని 35 % మంది చెప్పారు.
  • వారసత్వ రాజకీయాలు: బీజేపీ 59 శాతం, కాంగ్రెస్ పార్టీ 30 శాతం, జేడీఎస్ 8 శాతం
  • గ్రూపు రాజకీయాలు: బీజేపీ 55 శాతం, కాంగ్రెస్ 30 శాతం, జేడీఎస్ 12 శాతం
  • రాష్ట్ర అభివృద్ధి విషయంలో: కాంగ్రెస్ 47 శాతం, బీజేపీ 37 శాతం, జేడీఎస్ 14 శాతం
  • మత సామరస్యం: కాంగ్రెస్ 49 శాతం, బీజేపీ 34 శాతం, జేడీఎస్ 14 శాతం

More Telugu News