Gaddar: గద్దర్ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటన

Gaddar ready to fray direct elections
  • రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన గద్దర్
  • తనకు రక్షణ కల్పించాలని తూప్రాన్ పోలీసులను కోరిన ప్రజా గాయకుడు
  • సొంతూరిపై పుస్తకం రాసినట్టు వెల్లడి
ప్రజా గాయకుడు గద్దర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై పోటీ చేయబోతున్నట్టు తెలిపారు.

మెదక్ జిల్లా తూప్రాన్‌లో నిన్న పోలీసులను కలిసిన గద్దర్ తనకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తన వయసు 76 సంవత్సరాలని, కాబట్టి ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు మనసులో మాటను బయటపెట్టారు. తమ గ్రామంపై ‘మై విలేజ్ ఆఫ్ ది 60 ఇయర్స్’ పేరుతో పుస్తకం రాసినట్టు గద్దర్ తెలిపారు. రానున్న ఎన్నికలతో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెడుతున్నట్టు వివరించారు.
Gaddar
Telangana
KCR
Gaddar Politics

More Telugu News