Adireddy Bhavani: వైసీపీ నేతల చిట్ ఫండ్ కంపెనీలలో తనిఖీలు చేయడం లేదేం?: ఆదిరెడ్డి భవానీ

Adireddy Bhavani questions why police not searching in ycp leaders chit companies
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామనే కక్ష సాధించారన్న భవానీ
  • పోలింగ్ సమయంలోను రెండ్రోజులు తమ ఇంటి వద్దే ఉన్నారని వ్యాఖ్య
  • ఇతర చిట్ ఫండ్ కంపెనీల గురించి మాట్లాడలేదని ప్రశ్న
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశామనే కక్షతో తన భర్త ఆదిరెడ్డి వాసు, మామ ఆదిరెడ్డి అప్పారావులను జైల్లో పెట్టారని రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో రెండు రోజుల పాటు తమ ఇంటి వద్దే అధికార పార్టీ వారు తచ్చాడారని అన్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు చిట్స్ కంపెనీలను ఏమీ చేయకుండా తమ కుటుంబ సభ్యుల చిట్ కంపెనీపైనే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. వైసీపీ నేతలు నడుపుతున్న చిట్ ఫండ్ కంపెనీలలో ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించారు.

గత నాలుగేళ్లుగా ఏపీలో కక్షపూరిత ధోరణిని చూస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతలు ఎవరైనా... ప్రభుత్వంపై బలంగా మాట్లాడితే టార్గెట్ చేస్తున్నారన్నారు. పెద్ద నేతల నుండి చిన్నస్థాయి నేతల వరకు ఇదే వేధింపులు ఉన్నాయన్నారు.
Adireddy Bhavani
YSRCP
Telugudesam

More Telugu News