Cyclone: ఈ నెల 6 తర్వాత బంగాళాఖాతంలో తుపాను

  • తుపాను ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న ఐఎండీ
  • ఈ నెల 6న ఆవర్తనం
  • 8వ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం
  • క్రమంగా బలపడి తుపానుగా రూపాంతరం చెందుతుందన్న ఐఎండీ
IMD predicts cyclone after May 6 in Bay Of Bengal

ఎండలు మండిపోయే నడి వేసవిలోనూ అప్పుడప్పుడు తుపానులు సంభవిస్తుండడం తెలిసిందే. మరికొన్నిరోజుల్లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. మే 6వ తేదీన బంగాళాఖాతంలో తుపాను ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించింది. 

మే 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఆ తర్వాత 48 గంటల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. అయితే, ఈ తుపాను పయనం ఎటువైపు, దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంటుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగల నుంచి సామాన్యుడికి ఊరట కలుగుతున్నప్పటికీ, రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు ప్రాంతాల్లో పంటలు తడిసి పాడైపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే, రుతుపవనాల సీజన్ తరహాలో కుండపోత వానలు కురుస్తున్నాయి.

More Telugu News