Rupa Lakshmi: 15 ఏళ్లకే నాకు పెళ్లి చేసేశారు: 'బలగం' రూపలక్ష్మి

Rupa Lakshmi Interview
  • ఇటీవల భారీ విజయాన్ని అందుకున్న 'బలగం'
  • ఆడపడుచు పాత్రలో మెప్పించిన రూపలక్ష్మి 
  • 15 ఏళ్లకే తనకి పెళ్లి అయిందని వెల్లడి 
  • పెళ్లి తరువాతనే సినిమాల్లోకి వచ్చానని వ్యాఖ్య     
'బలగం' సినిమా ఈ మధ్య కాలంలో ఎంతగా ప్రభంజనాన్ని సృష్టించిందో .. ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో చేసిన నటీనటులందరికీ చాలా మంచి గుర్తింపు వచ్చింది. అలాంటివారి జాబితాలో రూపలక్ష్మి ఒకరుగా కనిపిస్తారు. ఈ సినిమాలో ఆమె పుట్టింటివారికీ .. అత్తింటివారికి మధ్య నలిగిపోయే లక్ష్మి పాత్రను పోషించారు. 

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు వేరు. మొదటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం .. అందువల్లనే చదువు కూడా పెద్దగా అబ్బలేదు. నాకు మూడు నెలల వయసు ఉన్నప్పుడే నన్ను దత్తత చేసేశారు. అలా చిన్నప్పుడే నేను పుట్టినింటికి దూరమయ్యాను" అని అన్నారు. 

కొన్ని కారణాల వలన 15 ఏళ్లకే నాకు పెళ్లి చేసేశారు .. ఆ వెంటనే పిల్లలు. పెళ్లి అయిన తరువాతనే నేను సినిమాల్లోకి వచ్చాను. ఇక రీసెంట్ గా వచ్చిన 'బలగం' వలన, నాకు మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్లినా అంతా కూడా నన్ను తమ ఇంటి ఆడపడుచు మాదిరిగానే చూస్తున్నారు" అంటూ చెప్పుకొచ్చారు. 
Rupa Lakshmi
Actress
Balagam Movie

More Telugu News