Woman: విడాకులను వేడుకగా చేసుకున్న మహిళ.. చూస్తే మతి పోవాల్సిందే!

  • విడాకులు తీసుకోవాల్సి వస్తే విచారించాల్సిన అవసరం లేదన్న మహిళ
  • విడాకులు వైఫల్యం కాదని, జీవితాన్ని మలుపు తిప్పేదంటూ భాష్యం
  • ధైర్యవంతులైన మహిళలు అందరికీ ఇది అంకితమని పోస్ట్
Woman celebrates divorce with unique photoshoot

‘‘ఓ విషాదకర వివాహ బంధాన్ని విడిచి పెట్టేందుకు విచారించక్కర్లేదు. ఎందుకంటే, సంతోషంగా ఉండడానికి మీరు అర్హులు. మీ జీవితంపై నియంత్రణను మీ చేతుల్లోకి తీసుకోండి. మీకు, మీ పిల్లల మెరుగైన భవిష్యత్తుకు కావాల్సిన మార్పులు తీసుకురండి. విడాకులు వైఫల్యం కానే కాదు! మీ జీవితాన్ని మలుపు తిప్పేది. మీ జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేది. వైవాహిక బంధాన్ని వదిలిపెట్టి ఒంటరిగా ప్రయాణించేందుకు ఎంతో సాహసం కావాలి. కావున ధైర్యవంతులైన మహిళలు అందరికీ నేను దీన్ని అంకితం చేస్తున్నాను’’ అంటూ పెళ్లయ్యి ఒంటరి జీవితాన్ని ఎంపిక చేసుకున్న షాలిని అనే మహిళ ఇతర మహిళలకు ఇచ్చిన సందేశం ఇది. 

ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టింది. విడాకులను ఓ వేడుకలా జరుపుకుని అందుకు సంబంధించి ఫొటోషూట్ చేయించుకుంది. ఆ ఫొటోలతో ఇన్ స్టా ఖాతాను నింపేసింది. తనకు 99 సమస్యలు ఉన్నాయంటూ, వాటిల్లో భర్త కూడా ఒక సమస్య కాకూడదని ఆమె కొటేషన్ పెట్టింది. ఎర్రటి డ్రెస్ ధరించి, డైవర్స్ డ్ అనే లెటర్స్ ను పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేసింది. తన పెళ్లి సమయంలో భర్తతో దిగిన ఫొటోని మధ్యకు చింపేస్తూ మరో  ఫొటోని షేర్ చేసింది. భర్త ఫొటోని కాలి కింద వేసి తొక్కి తనలో తానే ఆనందాన్ని అనుభవించింది. మొత్తానికి వైవాహిక బంధాన్ని తెంపుకోవాల్సి వస్తే, విచారించడం వల్ల లాభం లేదని.. దాన్ని సంతోషంగా స్వీకరించడంటూ ఆమె సందేశాన్ని పంచింది. 

More Telugu News