pearls: అలియాభట్ వంటిపై లక్ష ముత్యాలతో రూపొందించిన వస్త్రం

1 lakh pearls and inspiration from Claudia Schiffer Alia Bhatt Met Gala look
  • భారత్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన గౌన్
  • ఎంతో అందంగా ఉన్నావంటూ కత్రినా, కరీనా ప్రశంసలు
  • నల్లటి గౌన్ లో మెరిసిన ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ
న్యూయార్క్ పట్టణంలో జరుగుతున్న ‘మెట్ గాలా 2023’ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి అలియాభట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లక్ష ముత్యాలతో రూపొందించిన గౌన్ ను ధరించి కార్యక్రమానికి హాజరైంది. అందరి చూపులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోని అలియాభట్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘సంప్రదాయ తరహాలో ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను. ఈ ఎంబ్రాయిడరీని భారత్ లోనే లక్ష ముత్యాలతో రూపొందించారు. దీన్ని ధరించడం పట్ల ఎంతో సంతోషంగా ఉంది’’ అని అలియా భట్ పేర్కొంది. 

ఎంతో అందంగా, చూడ చక్కగా ఉన్నావంటూ కత్రినా కైఫ్, కరీనా కపూర్, జాన్వీ కపూర్ అలియాభట్ ను మెచ్చుకున్నారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో దేశంలోనే అత్యధిక సంపద కలిగిన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ సైతం దర్శనమిచ్చారు. నల్లటి గౌన్, ముత్యాలు, రాళ్లు పొదిగిన అంచుతో మెరుస్తూ ఉన్న దాన్ని ధరించారు. 
 
pearls
one lakh
gown
weared
Alia Bhatt
Met Gala event
isha ambani

More Telugu News