Devineni Uma: జగన్ మోడ్రన్ డే పది తలల రాక్షసుడు: దేవినేని

Devineni Uma fires at YS Jagan
  • జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీని దివాలా తీయించారని వ్యాఖ్య
  • జగన్ రెండు లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేశారన్న మాజీ మంత్రి
  • అధినేత అండతో వైసీపీ నేతలు పిల్ల రాక్షసుల్లా తయారయ్యారని మండిపాటు

సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ను దివాలా తీయించారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. మోడ్రన్ డే పది తలల రాక్షసుడు, అవినీతి నేర రాక్షసుడు ఈ జగన్ అని అన్నారు. జగన్ రెండు లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేశారని ఆరోపించారు.

జగన్ అండతో వైసీపీ నేతలు పిల్ల రాక్షసుల్లా తయారయ్యారన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశం సీఎం జగన్ కు ముందే తెలుసునని చెప్పారు. లిక్కర్ మాఫియాలో 11 వేల కోట్ల రూపాయలను దోచి ఏపీని గంజాయి ఆంధ్రప్రదేశ్, మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు. 

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ను పనికిమాలిన నేతలు విమర్శిస్తున్నారని ఉమ అన్నారు. జగన్... రజనీకాంత్ కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News