Telangana: కార్మిక దుస్తులు ధరించి.. డప్పు కొట్టిన మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy perform at Ravindra bharathi
  • రవీంద్ర భారతి లో కార్మిక దినోత్సవం
  • తెలంగాణ ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
  • సందడి చేసిన మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి
మేడే సందర్భంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కార్మికులకు ఆయన శ్రమశక్తి అవార్డులను అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి సందడి చేశారు. కార్మికులు ధరించే ఖాకీ ప్యాంటు, చొక్కా వేసుకొని మెడలో ఎర్ర కండువా ధరించారు. సాంస్కృతిక శాఖ కళాకారులతో కలిసి కాలు కదిపారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి డప్పుకొట్టి సందడి చేశారు.
Telangana
Minister
mallareddy

More Telugu News