Harsh Goenka: కేవలం సూర్యరశ్మితో నడిచే చౌక వాహనం

  • ఏడుగురిని తీసుకెళ్లే బైక్
  • దీనికి ఇంధనం సూర్యరశ్మి
  • వాహనంపై సోలార్ ప్యానెల్స్ తో రూఫ్ ఏర్పాటు
  • ట్విట్టర్ లో పరిచయం చేసిన పారిశ్రామికవేత్త హర్ష గోయంకా
Harsh Goenka shares clip of seven seater solar powered vehicle made from scrap Twitter is impressed

మన దేశంలో ప్రతిభా పాటవాలకు, ఆవిష్కరణలకు కొదవ లేదు. కాకపోతే ప్రోత్సాహమే సరిగ్గా ఉండదు. చిన్న ప్రోత్సాహం ఓ బాలుడ్ని చక్కని వాహనం తయారీకి ప్రోత్సహించాయంటే నమ్మాల్సిందే. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంకా ఇందుకు సంబంధించి ఓ వీడియోని తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

ఇది వినూత్నమైన ఓ సాలార్ పవర్డ్ వెహికల్. ద్విచక్ర వాహనమే అయినా పొడవుగా ఉండడంతో నడిపే వ్యక్తి సహా మొత్తంగా ఏడుగురిని ఈ వాహనం తీసుకెళుతుంది. పొడవాటి మోటారు సైకిల్ మాదిరిగా ఉంటుంది. వాహనంపై కూర్చునే వారికి పైన రూఫ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇది సోలార్ రూఫ్. సోలార్ ఫొటో వోల్టాయిక్ సెల్స్ తో కూడిన ప్యానల్స్ ను పైకప్పుగా ఏర్పాటు చేశారు. వీటిపై ఎండ పడి అది బ్యాటరీలో శక్తిగా చేరుతుంది. ఆ శక్తితో వాహనం నడుస్తుంది. వాహనంపై కూర్చున్న వారికి ఎండ, వాన నుంచి రూఫ్ రక్షణగానూ పనిచేస్తుంది.

ఇది ఎంతో స్థిరమైన ఆవిష్కరణ అని, తుక్కు నుంచి తయారు చేసినదని హర్ష గోయంకా వెల్లడించారు. ఇలాంటి ఆవిష్కరణలు భారత్ గర్వపడేలా చేస్తాయని ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు సైతం సానుకూల కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News