Pawan Kalyan: ‘గబ్బర్‌ సింగ్‌’ మ్యూజికల్‌ మ్యాజిక్‌ రిపీట్!

DSP set to give another memorable album with Ustaad Bhagat Singh
  • ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ
  • మొదలైన మ్యూజిక్ సిట్టింగ్స్
  • పవన్ సరసన హీరోయిన్ గా శ్రీలీల
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. 2012లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిత్రంలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ముగ్గురి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. పవన్‌ తో మరో హిట్ కొట్టాలనే లక్ష్యంతో హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రం రూపొందుతున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇప్పటికే చిత్రీకరణ మొదలైంది.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్‌ ఖరారైనట్టు చిత్ర బృందం తెలిపింది. ‘మ్యాజికల్ మ్యూజికల్ కాంబినేషన్ తిరిగొచ్చింది’ అంటూ ఉస్తాద్‌ గబ్బర్‌సింగ్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలలైన విషయాన్ని ట్విట్టర్ లో తెలిపింది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌, దేవిశ్రీ ప్రసాద్‌ చర్చలు జరుపుతున్న ఓ వీడియోను జత చేసింది. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌ వస్తాయని మైత్రీ సంస్థ పేర్కొంది. గబ్బర్ సింగ్ మాదిరిగా ఈ సినిమాలో కూడా పవన్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. యువ నటి శ్రీలీల హీరోయిన్. ఓ వైపు చిత్రీకరణతో పాటు మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.
Pawan Kalyan
Ustaad Bhagat Singh
devisri prasad
harish shakar

More Telugu News