Chennai: విమానాశ్రయంలో షాకింగ్ సీన్.. మహిళ లగేజీలో 22 పాములు

Snakes Slither Out Of Womans Luggage At Chennai Airport
  • శుక్రవారం చెన్నై ఎయిర్‌పోర్టులో వెలుగు చూసిన ఘటన
  • ప్రయాణికురాలి లగేజీ చెక్ చేస్తే బయటపడ్డ 22 పాములు, ఓ ఊసరవెల్లి
  • మలేషియా నుంచి చెన్నైకి వచ్చిన మహిళ
  • నిందితురాలిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు, అరెస్ట్
చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం షాకింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. తన లగేజీలో పాములు, బల్లులు తరలిస్తూ ఓ మహిళ కస్టమ్స్ అధికారులకు చిక్కింది. ఆమె మలేషియా నుంచి చెన్నైకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. నిందితురాలి లగేజీలో ఏకంగా 22 పాములు, ఓ ఊసరవెల్లి ఉన్నట్టు గుర్తించారు. 

ఆమె వాటిని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి తీసుకొచ్చింది. లగేజీలోంచి ఒక్కసారిగా బయటపడ్డ పాములను ఎయిర్‌పోర్టు సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు. మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు ఆమెపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Chennai

More Telugu News