TSRTC: కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 47 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిన బొగ్గులారీ

43 Passengers injured in road accident held in Kothagudem dist
  • 47 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు
  • చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద ఢీకొట్టిన లారీ
  • 43 మంది ప్రయాణికులకు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 47 మంది ప్రయాణికులతో భద్రాచలం నుంచి గుంటూరు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు రెండు పల్టీలు కొట్టింది. చుంచుపల్లి మండలం ఆనందగని వద్ద ఈ ఘటన జరిగింది. బస్సు బోల్తా పడడంతో 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితుల్లో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం తదితర పట్టణాలకు చెందిన వారు ఉన్నారు.
TSRTC
Bhadradri Kothagudem District
Guntur
Road Accident

More Telugu News