Telangana: కొత్త సచివాలయంలో తొలి సమీక్ష దానిపైనే!

Harish rao to hold first review meeting in new Secretariat
  • రేపు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం
  • సాగు నీటి రంగంపై మొదటి సమీక్ష నిర్వహించాలని నిర్ణయం
  • సీతారామ, సీతమ్మ సాగర్ పై హరీశ్ రావు నేతృత్వంలో సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త పాలన సౌథాన్ని ప్రారంభిస్తారు. నూతన సచివాలయంలో అడుగు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సుముహూర్తంలో ఒక్కో ఫైల్ పై సంతకాలు చేయనున్నారు. అదే రోజు కొత్త పాలనా సౌథంలో తొలి సమీక్ష సమావేశం నిర్ణయించాలని ప్రభుత్వం భావించింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న సాగునీటి రంగంపైనే ఈ సమీక్ష జరగనుంది. 

అయితే, ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొనడం లేదని తెలుస్తోంది.  సీతారామ, సీతమ్మసాగర్‌ బహుళార్ధక సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు సమీక్ష జరగనుంది. సచివాలయం రెండో అంతస్తులోని ‘ఏ’ వింగ్‌ మీటింగ్‌ హాల్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలతోపాటు, రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ అధికారులు పాల్గొననున్నారు.
Telangana
brs
new Secretariat
Harish Rao
KCR

More Telugu News