ఢిల్లీ మెట్రోలో అందరూ చూస్తుండగా యువకుడి అసభ్యకరమైన పని.. తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్
- కఠిన చర్యలు తీసుకోవాలంటూ నోటీసుల జారీ
- ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరిన ఢిల్లీ మెట్రో
- కేసు నమోదు చేసిన పోలీసులు
దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి షేర్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లోకి చేరి సంచలనంగా మారింది. ఢిల్లీ మహిళా కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించింది. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ మెట్రో, పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలైవాల్ నోటీసులు జారీ చేశారు. ‘‘ఢిల్లీ మెట్రోలో ఓ వ్యక్తి సిగ్గు లేకుండా మాస్టర్ బేటింగ్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది పూర్తిగా అసహ్యకరమైనది. అనారోగ్యకరమైనది. ఈ చర్యపై వీలైనంత వరకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు, మెట్రో అధికారులకు నోటీసులు జారీ చేశాను’’ అని స్వాతి మలైవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ మెట్రో కూడా స్పందించింది. ‘‘మెట్రోలో ప్రయాణించే సమయంలో బాధ్యతాయుతంగా నడుచుకోవాలని అభ్యర్థిస్తున్నాం. ఎవరైనా అసభ్యకరమైన ప్రవర్తనను గుర్తిస్తే వెంటనే దాన్ని డీఎంఆర్సీ హెల్ప్ లైన్ కు కాల్ చేసి తెలియజేయండి’’ అంటూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ట్వీట్ చేసింది. పోలీసులు సైతం సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదులు పెట్టారు.
ఇక ఢిల్లీ మెట్రో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. మహిళల మాదిరిగా స్కర్ట్ లు ధరించి పురుషులు మెట్రోల్లో ప్రయాణించడం, బెత్తెడంత వస్త్రాన్ని నడుము దగ్గర ధరించి యువతులు ప్రయాణించడం, మెట్రోల్లో పూనకం వచ్చినట్టు డ్యాన్స్ చేస్తూ వీడియోలు విడుదల చేయడం.. చెప్పుకుంటూ పోతే ఇలాంటివి చాలానే ఉన్నాయి.