Rajinikanth: 19 ఏళ్ల తర్వాత విజయవాడకు తలైవా..!

Tamil Super Star Rajinikanth Arrived Vijayawada After 19 Years
  • 2004లో కృష్ణా పుష్కరాల కోసం విజయవాడ వచ్చిన తలైవా
  • శతజయంతి ఉత్సవాలకు వచ్చినందుకు బాలయ్య  కృతజ్ఞతలు
  • అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఎలా ఉంటానన్న రజనీకాంత్
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రజనీకాంత్ విజయవాడ రావడం 19 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2004లో కృష్ణా పుష్కరాల కోసం ఆయన విజయవాడ వచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ విజయవాడ వచ్చిన తలైవాను చూసేందుకు జనం ఎగబడ్డారు. 

గన్నవరం విమానాశ్రయంలో రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో స్పందించిన రజనీకాంత్.. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా? అని నవ్వుతూ బదులిచ్చారు.
Rajinikanth
Vijayawada
NTR Centenary Celebrations
Telugudesam

More Telugu News