KTR: ఢిల్లీలో ధర్నా చేస్తున్న రెజ్లర్లకు కేటీఆర్ మద్దతు

  • రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
  • బ్రిజ్ భూషణ్ ను జైల్లో పెట్టాలంటున్న రెజ్లర్లు
  • గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ధర్నాలు
  • న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు బాసటగా నిలవాలన్న కేటీఆర్
KTR supports wrestlers who protests in Delhi

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో గత కొన్నిరోజులుగా ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కూడా. 

అయితే ఆయనపై గత కొన్నినెలలుగా ప్రముఖ రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని, జైల్లో పెట్టాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రెజ్లర్లు ధర్నాకు తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు తెలిపారు. 

"ఈ ఒలింపిక్ చాంపియన్లు దేశానికి పతకాలు తెచ్చినప్పుడు మనం సంబరాలు చేసుకుంటాం. ఇప్పుడు వాళ్లు న్యాయం కోసం పోరాడుతున్న తరుణంలో మనందరం వారికి బాసటగా నిలవాలి. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై వచ్చిన తీవ్రస్థాయి లైంగిక వేధింపుల ఆరోపణల పట్ల నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరపాలి. న్యాయాన్ని కాపాడాలి. రెజ్లర్ల నిరసనకు నా హృదయపూర్వక మద్దతు తెలుపుతున్నాను" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

More Telugu News