Chandrababu: యుగానికో రాక్షసుడు పుడుతుంటాడు... జగన్ ఇప్పుడు పుట్టాడు: చంద్రబాబు

chandrababu naidu fires at ys jagan
  • తల్లి ప్రేమ లేదు... చెల్లి ప్రేమ లేదని జగన్‌పై బాబు విమర్శ
  • బాబాయిని చంపించాడు... మరో బాబాయిని జైలుకు పంపించాడని వ్యాఖ్య
  • జగన్ ఇక్కడితో ఆగేలా లేడని వెల్లడి
యుగానికో రాక్షసుడు పుడతాడని, అలాగే ఈ కాలంలో జగన్ పుట్టాడని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఆయనకు తల్లి అంటే ప్రేమ లేదు... చెల్లి అంటే ప్రేమ లేదు అని విమర్శలు గుప్పించారు. ఓ బాబాయిని చంపించాడని, మరో బాబాయిని జైలుకు పంపించాడని ఆరోపించారు. జగన్ ఇక్కడితో ఆగేలా లేడని, తన ఇంట్లోనే ఏదో ఒకటి చేసుకొని, మన మీద ఆ నెపం నెట్టే ప్రయత్నం చేస్తాడన్నారు.

ఇప్పటికే జగన్ రెడ్డి కోడి కత్తి డ్రామా ఆడారన్నారు. జగన్ కళ్లలో ఆనందం కోసమే దాడి చేసినట్లు కోడి కత్తి శ్రీను చెప్పాడన్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీనును కూడా చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి వారిని అడ్డుకోవాల్సి ఉన్నదన్నారు.
Chandrababu
YS Jagan

More Telugu News