ar rehman: ఏఆర్ రెహమాన్ భార్యకు తమిళం రాదా?: కస్తూరి ప్రశ్న

AR Rahmans wife trolled for not speaking Tamil
  • అవార్డుల కార్యక్రమంలో తమిళం సరిగ్గా రాదన్న రెహమాన్ భార్య
  • తమిళంలో రాకపోవడంపై నటి కస్తూరి శంకర్ ప్రశ్న
  • నా భార్యను గౌరవిస్తానని సంగీత దర్శకుడి స్పందన
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సతీమణి సైరా బాను తనకు తమిళం సరిగ్గా రాదని చెప్పడంపై నటి కస్తూరి కామెంట్ చేసింది. దీనికి ఏఆర్ రెహమాన్ ప్రతిస్పందించారు. రెహమాన్ దంపతులు ఇటీవల చెన్నైలో వికటన్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెహమాన్ హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలని తన భార్యను కోరాడు. అయితే తనకు తమిళం సరిగ్గా రాదని సైరా బాను చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సైరాకు తమిళం రాకపోవడంపై నటి కస్తూరి శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. రెహమాన్ భార్యకు తమిళం రాదా.. ఆమె మాతృభాష ఏమిటి.. వాళ్లు ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రెహమాన్ నా ప్రేమను నేను గౌరవిస్తానని తన భార్యకు మద్దతుగా సమాధానం ఇచ్చాడు. ఈ మేరకు తమిళంలో స్పందించాడు.
ar rehman
Tamil Nadu

More Telugu News