Anand Mahindra: ఆనంద్ మహీంద్రా మెచ్చిన ‘డే కేర్ సెంటర్’.. కారణమిదే!

anand mahindra shares a board photo of denmark cafe for advertising itself as husband day care centre
  • డెన్మార్క్ లో కేఫ్ పేరును ‘భర్తల డే కేర్ సెంటర్’గా పెట్టిన నిర్వాహకులు
  • కేఫ్ ప్రచార నైపుణ్యాన్ని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా
  • బ్రిలియంట్ ఐడియా అంటూ ట్వీట్
పిల్లల డే కేర్ సెంటర్లను చూశాం.. పెద్దలను జాగ్రత్తగా చూసుకునే సెంటర్లను చూశాం.. కానీ ఇది కాస్త వెరైటీ. ‘భర్తల డే కేర్ సెంటర్’ అట. డెన్మార్క్‌లోని ఒక కేఫ్ బయట పెట్టిన బోర్డు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది.

కేఫ్ ఉపయోగించిన వినూత్న ప్రచార నైపుణ్యాన్ని ఆయన మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ‘‘ఇన్నోవేషన్ అనేది కొత్త ఉత్పత్తిని తయారు చేయడం మాత్రమే కాదు. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను ఉపయోగించడానికి కొత్త మార్గాలను కనుగొనడం కూడా. బ్రిలియంట్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

మహీంద్రా పోస్ట్ చేసిన ఫొటోలోని బోర్డుపై.. ‘‘మీకోసం సమయం కావాలా? రిలాక్స్ కావాలని అనుకుంటున్నారా? షాపింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ భర్తను మా దగ్గర వదిలి వెళ్లండి. మీ కోసం ఆయన్ను మేం జాగ్రత్తగా చూసుకుంటాం. ఆయన తాగే వాటికి మాత్రమే మీరు డబ్బు చెల్లించండి’’ అని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కామెంట్లు, లైకుల వర్షం కురుస్తోంది.
Anand Mahindra
denmark cafe
husband day care centre
advertising

More Telugu News