Telangana: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసుపై సిట్ కు హైకోర్టు కీలక ఆదేశం

  • దర్యాప్తు వేగవంతం చేయాలని సిట్ కు సూచన
  • కేసును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు
  • దర్యాప్తు పురోగతిపై జూన్‌ 5 లోపు  నివేదిక ఇవ్వాలన్న న్యాయస్థానం
High Court Hears on TSPSC Case

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్ష పత్రాల లీక్ కేసు విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఎన్ ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించింది. 

కేసును సీబీఐకి అప్పగించే విషయమై ఈ సమయంలో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.  అదే సమయంలో టీఎస్ పీఎస్సీలోని ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని ప్రశ్నించారా?అని అధికారులను ప్రశ్నించింది. తాము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్‌ కోసం ఎదురుచూస్తున్నామని ఏజీ న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విచారణ పురోగతిపై రిపోర్టును జూన్‌ 5 లోపు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదే రోజు (జూన్ 5)కు వాయిదా వేసింది.

More Telugu News