Rajinikanth: రజనీకాంత్ కు ఘన స్వాగతం పలికిన బాలకృష్ణ

Balakrishna welcomes Rajinikanth
  • ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన రజనీ
  • గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన బాలయ్య
  • రజనీకి తేనీటి విందు ఇవ్వనున్న చంద్రబాబు

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడకు చేరుకున్నారు. దివంగత ఎన్టీఆర్ శత జయంతి వేడుకల అంకురార్పణ సభలో పాల్గొనేందుకు రజనీకాంత్ విజయవాడకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రజనీకి నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసంలో రజనీకి టీడీపీ అధినేత చంద్రబాబు తేనీటి విందు ఇవ్వనున్నారు. 2004లో కృష్ణానది పుష్కరాల సందర్భంగా రజనీకాంత్ విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. 


ఈ సాయంత్రం పోరంకి అనుమోలు గార్డెన్స్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సభ జరగనుంది. ఈ సభలో చంద్రబాబు, బాలకృష్ణ, రజనీకాంత్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాలను ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News