Varla Ramaiah: వంగలేని జగన్ వృద్ధుడా, ఎగిరిదూకిన చంద్రబాబునా?: వర్ల రామయ్య

Varla Ramaiah fires at YS Jagan for his comments on chandrababui
  • కొందరు పుట్టుకతోనే వృద్ధులని జగన్ పై వర్ల విమర్శలు
  • ఎనిమిదిన్నరకే కొట్టు కట్టేసే జగన్ వృద్ధుడు కాదా?
  • ఏ మచ్చ లేని చంద్రబాబును జగన్ ఎగతాళి చేయడమా అని వ్యాఖ్య
మాజీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం నిప్పులు చెరిగారు. కొందరు పుట్టుకతోనే వృద్ధులు అన్న శ్రీశ్రీ వ్యాఖ్యలు జగన్ కు సరిగ్గా సరిపోతాయన్నారు. వంగి కొబ్బరికాయ కొట్టలేని జగన్ రెడ్డి వృద్ధుడా? లేదంటే స్వతహాగా కాలువ తూమును ఎగిరి దూకిన చంద్రబాబు వృద్ధుడా? అని నిలదీశారు. రాత్రి ఎనిమిదిన్నర గంటలకే కొట్టు కట్టేసే జగన్ రెడ్డి వృద్ధుడా? లేక అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు పని చేసే చంద్రబాబు వృద్ధుడా? అన్నారు. పదహారు నెలలు జైల్లో ఉండి, 11 అవినీతి కేసుల్లో ఉన్న జగన్ రెడ్డి... ఏ మచ్చలేని చంద్రబాబును ఎగతాళి చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Varla Ramaiah

More Telugu News