Sensex: వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 349 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 101 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.39 శాతం లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను కొనసాగించాయి. విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 60,649కి చేరుకుంది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17,915 వద్ద స్థిరపడింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.39%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.90%), భారతి ఎయిర్ టెల్ (1.62%), ఇన్ఫోసిస్ (1.55%), కోటక్ బ్యాంక్ (1.37%). 

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-1.46%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.13%), యాక్సిస్ బ్యాంక్ (-0.76%), టీసీఎస్ (-0.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.24%).

More Telugu News