MBBS Doctors: ఎంబీబీఎస్ వైద్యులతో సమాన జీతానికి ఆయుర్వేద వైద్యులు అర్హులు కారు: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

Supreme Court says Ayurvedic doctors never entitled to the same salary as MBBS doctors
  • అల్లోపతి వైద్యులతో సమానంగా ఆయుర్వేద వైద్యులు
  • 2012లో తీర్పు ఇచ్చిన గుజరాత్ హైకోర్టు
  • గుజరాత్ హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • ఆయుర్వేదం ప్రత్యామ్నాయ వైద్య విధానం మాత్రమేనని స్పష్టీకరణ
ఎంబీబీఎస్ పట్టా ఉన్న వైద్యులతో సమానంగా ఆయుర్వేద వైద్యులను కూడా పరిగణించాలని 11 ఏళ్ల కిందట గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఎంతో కష్ట సాధ్యమైన శస్త్ర చికిత్సలు, తీవ్రమైన గాయాలకు, అత్యవసర కేసులకు ఎంబీబీఎస్ వైద్యులు సేవలు అందిస్తారని, అలాంటి అల్లోపతి డాక్టర్లతో సమాన వేతనానికి ఆయుర్వేద వైద్యులు అర్హులు కాలేరని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. 

పోస్టుమార్టంలు కూడా అల్లోపతి వైద్యులే నిర్వహిస్తారని జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ధర్మాసనం వివరించింది. ఆయుర్వేదం ప్రత్యామ్నాయ లేదా దేశీ వైద్య విధానం మాత్రమేనని, ఆ మేరకు ఆయుర్వేదం ప్రాముఖ్యతను గుర్తిస్తామని పేర్కొంది.
MBBS Doctors
Ayurvedic Doctors
Supreme Court
Salary
Gujarat High Court

More Telugu News