Madhu Bala: బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదు: మధుబాల

I cant understand how RRR and Bahubali became huge hits says Madhubala
  • 'శాకుంతలం' ఫెయిల్ కావడంపై మధుబాల ఆవేదన
  • సినిమా ఘన విజయం సాధిస్తుందనుకున్నానని వ్యాఖ్య
  • ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఎంతో కష్టపడ్డారన్న మధు
సమంత ప్రధాన పాత్ర పోషించిన 'శాకుంతలం' సినిమా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలను పోషించారు. 

తాజాగా ఈ చిత్రం ఫ్లాప్ కావడంపై మధుబాల స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఫెయిల్యూర్ కావడం బాధించిందని ఆమె అన్నారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఎంతో కష్టపడ్డారని తెలిపారు. షూటింగ్ సమయంలో నటులు, టెక్నీషియన్స్ పై కూడా ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఘన విజయం సాధిస్తుందనుకున్న ఈ సినిమా ఫెయిల్ కావడం నిరాశకు గురిచేసిందని అన్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలు ఘన విజయం సాధించాయని.. ఆ చిత్రాలు ఆ రేంజ్ లో ఎలా హిట్ అయ్యాయో అర్థం కావడం లేదని చెప్పారు.
Madhu Bala
Sakunthalam
Samantha
RRR
Bahubali
Tollywood

More Telugu News