kolkata: నితీష్ రాణా క్యాచ్ రెండు సార్లు మిస్.. బెంగళూరుకు భారీ టార్గెట్ ఇచ్చిన కోల్‌కతా

  • జేసన్ రాయ్ హాఫ్ సెంచరీ, నితీష్ రాణా పిఫ్టీ మిస్
  • 5 వికెట్లకు 200 పరుగులు చేసిన కోల్ కతా
  • చెరో రెండు వికెట్లు పడగొట్టిన హసరంగా, విజయ్ కుమార్
Jason Roy and Nitish Rana power Kolkata Knight Riders to 200

ఐపీఎల్ 16లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ను ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన కోల్ కతా బ్యాటర్లు అదరగొట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే జేసన్ రాయ్ 29 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులతో 56 పరుగులు చేశాడు. చివరలో నితీష్ రాణా 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 48 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 31, నారాయణ్ జగదీశన్ 29 బంతుల్లో 27 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ, విజయ్ కుమార్ చెరీ రెండు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

పదో ఓవర్ వరకు కోల్ కతా ఒక్క వికెట్ ను కోల్పోలేదు. విజయ్ కుమార్ వైశక్ వేసిన 10వ ఓవర్లో రెండో బంతికి జగదీశన్ అవుటయ్యాడు. ఆ తర్వాత వెంటనే జేసన్ రాయ్ వికెట్ తీశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది.

నితీష్ రాణాకు రెండుసార్లు లైఫ్ దొరికింది. 13వ ఓవర్లో కేకేఆర్ స్కిప్పర్ నితీష్ రాణా ఇచ్చిన క్యాచ్ ను మొహమ్మద్ సిరాజ్ మిస్ చేశాడు. అవుట్ అయితే వైశక్ కు మూడో వికెట్ అయ్యేది. కానీ క్యాచ్ మిస్ అయింది. ఆ తర్వాత 15వ ఓవర్లో ఐదో బంతిని కొట్టగా హర్షా పటేల్ క్యాచ్ మిస్ చేశాడు. అయితే ఆ తర్వాత నితీష్ రాణా 48 పరుగుల వద్ద ఔట్ కావడంతో హాఫ్ సెంచరీ మిస్ అయింది. కోల్ కతా 20 ఓవర్లలో 200 పరుగులు చేసి, బెంగళూరు ఎదుట 201 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

More Telugu News