Andhra Pradesh: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాల విడుదల.. కృష్ణా టాప్, విజయనగరం లాస్ట్

  • 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేసిన బోర్డు
  • ఫస్టియర్ లో 61 శాతం, సెకండియర్ లో 72 శాతం ఉత్తీర్ణత
  • మే 6వ తేదీ వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు
  • మే 24 నుండి సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 5 నుండి ప్రాక్టికల్స్
AP Inter results released today

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు బుధవారం సాయంత్రం విడుదలయ్యాయి. మంత్రి బొత్స సత్యనారాయణ వీటిని విడుదల చేశారు. కేవలం 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. వృత్తి విద్యా కోర్సు ఫలితాలు కూడా విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 83 శాతంతో మొదటి స్థానంలో, విజయనగరం 57 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచాయి.

4.33 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా, 61 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 3.79 లక్షల మంది ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 72 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఫస్టియర్ లో 2.66 లక్షల మంది, సెకండియర్ లో 2.72 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్, సెకండియర్... రెండింట్లోను అమ్మాయిలే టాప్ గా నిలిచారు. 

సప్లిమెంటరీ పరీక్షలు

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల కోసం దరఖాస్తు గడువు తేదీని మే 6వ తేదీగా నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ జూన్ 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

More Telugu News