Lingu Swamy: దర్శకుడు లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే విధించిన కోర్టు

  • చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న లింగుస్వామి
  • 6 నెలల జైలు శిక్ష విధించిన సైదాపేట కోర్టు
  • కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన లింగుస్వామి
Director Lingu Swamy gets relief in Madras High Court

ప్రముఖ తమిళ సినీ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్ బౌన్స్ కేసులో ఊరటను కల్పించింది. ఆయనకు కింది కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే... లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక సినిమాను నిర్మించడం కోసం పీవీపీ కేపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి 2014లో రూ. 1.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో రూ. 1.35 కోట్లకు చెక్ ఇవ్వగా... సదరు ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడంతో చెక్ బౌన్స్ అయింది. దీంతో పీవీపీ కేపిటల్స్ చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును వీరు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో వీరికి హైకోర్టు ఊరటను కలిగించింది.

More Telugu News