Maharashtra: మహారాష్ట్రలో పిడుగు పడి వ్యక్తి మృతి.. లైవ్ వీడియో

A Man Killed Caused by Thunderstorm lightning in Maharashtra
  • నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిపై పిడుగుపాటు
  • నిలుచున్న చోటే కుప్పకూలిన కార్మికుడు
  • చంద్రాపూర్ జిల్లా భద్రావతి తాలూకాలో ఘటన
  • సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు 
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మైదాన ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిపై పిడుగు పడింది. దీంతో నిలుచున్నచోటే ఆ కార్మికుడు పడిపోయాడు. సెకన్ల వ్యవధిలోనే అతని ప్రాణం పోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జిల్లాలోని భద్రావతి తాలూకా మాజ్రీ బొగ్గు గనిలో పనిచేస్తున్న కార్మికుడు. తన డ్యూటీ పూర్తవడంతో పని ప్రదేశం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అంతలో ఆకాశం నుంచి ప్రకాశవంతమైన మెరుపు అతనిపై పడింది. పిడుగు పాటు రూపంలో ఒక్కసారిగా వేల వాట్ల విద్యుత్ శరీరంపై పడడంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడిని బీహార్ కు చెందిన బాబుధన్ యాదవ్ గా గుర్తించినట్లు అధికారులు చెప్పారు.
Maharashtra
chandrapur
Thunderstorm
live video

More Telugu News