IPL: ముంబై ఇండియన్స్ కు మరో షాక్.. జట్టును విడిచిన స్టార్​ పేసర్

Jofra Archer briefly went to visit an elbow specialist in Belgium
  • మోచేయి గాయంతో బాధపడుతున్న ఆర్చర్
  • శస్త్ర చికిత్స కోసం బెల్జియం వెళ్లిన పేసర్
  • ఈ సీజన్ లో నిరాశ పరుస్తున్న ముంబై జట్టు
ఐపీఎల్ 16వ సీజన్ లో పడుతూ లేస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింటిలో పరాజయం పాలై మూడింటిలోనే గెలిచింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమి మూటగట్టుకొని డీలా పడింది. తాజాగా ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్, ఇంగ్లండ్ కు చెందిన జోఫ్రా ఆర్చర్ కు మళ్లీ గాయమైంది. అతని కుడి మోచేయికి దెబ్బ తగిలింది. దాంతో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో బరిలోకి దిగలేదు. 

తన గాయానికి చిన్న శస్త్రచికిత్స కోసం ఆర్చర్ ముంబై జట్టును విడిచి బెల్జియం వెళ్లిపోయాడు. అయితే, ఈ ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో అతను తిరిగి బరిలోకి దిగుతాడని జట్టు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇదే మోచేయి గాయం కారణంగా అతను రెండేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీజన్ లో రెండే మ్యాచ్ ల్లో బరిలోకి దిగాడు. ఈ నేపథ్యంలో తను ఐపీఎల్ 16లో తిరిగి పోటీ పడుతాడా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
IPL
2023
mumbai indians
Jofra Archer
Belgium

More Telugu News