Gujarat: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబయి... అర్జున్ టెండూల్కర్ జోరు పెంచేనా?

Mumbai Indians wins the toss and opts to field first
  • గుజరాత్ టైటాన్స్ కు మొదట బ్యాటింగ్ 
  • పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో గుజరాత్, ఏడో స్థానంలో ముంబయి
  • ఇటీవలి మ్యాచ్ లో గుజరాత్ పై ముంబయి విజయం 
అహ్మదాబాద్ వేదికగా నేడు గుజరాత్ టైటాన్స్ - ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. ఐపీఎల్ లో ఇది 35వ మ్యాచ్. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై టాస్ గెలిచి, ఫీల్డింగ్ ను ఎంచుకుంది. 

హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని గుజరాత్ ఇప్పటి వరకు 6 మ్యాచ్ లు ఆడి, నాలుగింట గెలవగా, ముంబయి 6 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ 4వ స్థానంలో, ముంబయి ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఈ జట్లు ఇటీవల తలపడినప్పుడు ముంబయి విజయం సాధించింది. అర్జున్ టెండూల్కర్ మళ్లీ దూకుడు పెంచుతాడా అనే ఆసక్తి చాలామందిలో ఉంది.

టీమ్ విషయానికి వస్తే...

గుజరాత్ టైటాన్స్ (Playing XI): వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

ముంబయి ఇండియన్స్ (Playing XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాంత్ కిషాన్ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరిడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్.
Gujarat
mumbai
Cricket

More Telugu News