KTR: బీఆర్ఎస్‌గా మారినా.. పార్టీ డీఎన్ఏ మాత్రం మారలేదు: కేటీఆర్

  • సిరిసిల్లలో నియోజకవర్గ ప్రతినిధుల సభకు కేటీఆర్
  • మెదడు లేని బంటి, పార్టీ మారే చంటి అంటూ ప్రతిపక్షాలపై విసుర్లు
  • దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అని వ్యాఖ్య
KTR says TRS DNA not changed

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినప్పటికీ తమ పార్టీ డీఎన్ఏ మారలేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు అన్నారు. ఆయన సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకులు తెలంగాణలో ఎవరూ లేరన్నారు. ఒకరు మెదడు లేని బంటి, ఇంకొకరు పార్టీలు మారే చంటి.. వాళ్లను ప్రతిపక్షమని అంటారా అని బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాము పని చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందన్నారు. దేశ జనాభాలో మూడు శాతం ఉన్న తెలంగాణకు 30 శాతం జాతీయ అవార్డులు వచ్చాయన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే సాధ్యమైందని చెప్పారు. తమ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, వారికి పేరుపేరునా ధన్యవాదాలు అన్నారు. 22 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ జలదృశ్యంలో టీఆర్ఎస్‌గా ఆవిర్భవించిన పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అయిందన్నారు. దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌ రూపాంతరం చెందిందన్నారు. మారింది టీఆర్‌ఎస్‌ పేరు నుండి బీఆర్ఎస్ గా అని, జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు.

More Telugu News