YS Sharmila: షర్మిలకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

  • నిన్న పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల
  • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
  • షరతులతో కూడిన బెయిల్ మంజూరు
Court grants bail to YS Sharmila

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. రెండు ష్యూరిటీలు, రూ. 30 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. నిన్న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన వెంటనే ఆమె తరపు లాయర్లు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ చేపడతామని కోర్టు నిన్న తెలిపింది. నేడు ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారని, ఆమెపై పలు కేసులు కూడా ఉన్నాయని, ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని పోలీసుల తరపు లాయర్లు వాదించారు. షర్మిల తరపు న్యాయవాదులు వాదిస్తూ... ఆమెను పోలీసులు ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారని... సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసమే ఆమె ప్రతిస్పందించారిని చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం షర్మిల చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఆ సాయంత్రానికి ఆమె జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

More Telugu News