Sania Mirza: సానియాతో విడాకుల వార్తలపై ఎట్టకేలకు స్పందించిన షోయబ్ మాలిక్

Shoaib Opens Up On Rumours That All Is Not Well With Wife Sania
  • సానియా-షోయబ్ జంట విడిపోతోందంటూ పుకార్లు
  • విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు
  • పుకార్లను పట్టించుకోం కాబట్టే ఇప్పటి వరకు స్పందించలేదన్న షోయబ్
  • తామెప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటామన్న స్టార్ క్రికెటర్
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ జంట విడిపోతోందంటూ ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. వారిద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. వారి గురించిన వార్తలు వైరల్ అయినప్పటికీ ఇద్దరూ ఎక్కడా బయటపడలేదు. బహిరంగంగా ఎప్పుడూ ఎక్కడా ఈ విషయమై పెదవి విప్పలేదు. 

తాజాగా, ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ షోయబ్ మాలిక్ స్పందించాడు. పాకిస్థాన్‌కు చెందిన ‘జియో న్యూస్’ కార్యక్రమం ‘స్కోర్’లో యాంకర్ అడిగిన ప్రశ్నకు షోయబ్ బదులిస్తూ.. తాము విడిపోతున్నట్టు వస్తున్న వార్తలు ఒట్టివేనని తేల్చి చెప్పాడు.

‘‘ఇందులో చెప్పడానికేముంది? ఈద్ రోజున ఇద్దరం కలిసి ఉంటే బాగుండేది. కానీ ఆమె (సానియా) ఐపీఎల్‌లో షోలతో బిజీగా ఉంది. ఆ కమిట్‌మెంట్స్ కారణంగానే ఆమె రాలేకపోయింది. అందుకే ఇద్దరం ఇప్పుడు కలిసి లేం. మేం ఎప్పుడూ ప్రేమను పంచుకుంటూ ఉంటాం. ఆమెను నేను చాలా కోల్పోతున్నా. మా బంధంపై నేను చెప్పగలిగేది ఇంతే’’ అని మాలిక్ పేర్కొన్నాడు. రూమర్లను తాము పట్టించుకోబోమని, అందుకే ఆమె కానీ, తాను కానీ వాటిపై ఇప్పటి వరకు స్పందించలేదని షోయబ్ అన్నాడు.
Sania Mirza
Shoaib Malik
Pakistan Cricket

More Telugu News