Fronx: భారత్ లో మారుతి కొత్త కారు 'ఫ్రాంక్స్'... నేడే విడుదల

  • కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో సరికొత్త కారు
  • చాలాకాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లు
  • పలు వేరియంట్లలో ఫ్రాంక్స్
  • ఆన్ లైన్ లేదా నెక్జా డీలర్ షిప్ లలో బుక్ చేసుకునే సదుపాయం
  • రూ.7.46 లక్షల నుంచి ధరల శ్రేణి ప్రారంభం
Maruti Suzuki releases new car Fronx

కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి తన కొత్త కారు ఫ్రాంక్స్ ను నేడు భారత మార్కెట్లో విడుదల చేసింది. భారతీయ కస్టమర్లు చాలాకాలంగా ఈ కారు కోసం ఎదురుచూస్తున్నారు. 

ఫ్రాంక్స్ ప్రారంభ ధర రూ.7.46 లక్షలు. ఇది ఎక్స్ షోరూం ధర. ధర కాస్త అందుబాటులో ఉండడం కూడా దీనిపై భారీ ఆసక్తి నెలకొనేందుకు కారణమైంది. 

ఇందులో 1.0 లీటర్ కే సిరీస్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ తో మరో వెర్షన్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ.9.72 లక్షల నుంచి రూ.13.13 లక్షల (ఎక్స్ షోరూం) వరకు ఉంది. 

మారుతి ఫ్రాంక్స్ కారును కస్టమర్లు ఆన్ లైన్ ద్వారా కానీ, లేక, దేశవ్యాప్తంగా ఉన్న నెక్జా డీలర్ షిప్ ల వద్ద కానీ బుక్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ గా రూ.11 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 

కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో ఫ్రాంక్స్... టాటా పంచ్, సిట్రోయెన్ సీ3, రెనో కైగర్, నిస్సాన్ మాగ్నైట్ లకు గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


వేరియంట్లు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు 5 వేరియంట్లతో వస్తోంది. సిగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జెటా, ఆల్ఫా వేరియంట్లలో ఫ్రాంక్స్ ను విడుదల చేశారు. వేరియంట్, అందులోని ఫీచర్లను బట్టి ధరలు మారుతుంటాయి.

రంగులు

ఫ్రాంక్స్ 10 మోనో టోన్, డ్యూయల్ టోన్ కలర్ స్కీముల్లో వస్తోంది. ఆర్కిటిక్ వైట్, స్ల్పెండిడ్ సిల్వర్, గ్రాండియన్ గ్రే, బ్లూయిష్ బ్లాక్, సెలెస్టియల్ బ్లూ, ఒప్యులెంట్ రెడ్, ఎర్తెన్ బ్రౌన్ వంటి మోనో టోన్ షేడ్లతో పాటు... స్ల్పెండిడ్ సిల్వర్-బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఒప్యులెంట్ రెడ్-బ్లూయిష్ బ్లాక్ రూఫ్, ఎర్తెన్ బ్రౌన్-బ్లూయిష్ బ్లాక్ రూఫ్ వంటి డ్యూయల్ టోన్ కలర్ స్కీముల్లో ఫ్రాంక్స్ ను డిజైన్ చేశారు.

ఫ్రాంక్స్ ఎక్స్ టీరియర్

ఫ్రాంక్స్ కారును గ్రాండ్ విటారా, బాలెనో మోడళ్ల స్ఫూర్తితో రూపొందించారు. మధ్యలో క్రోమ్ బార్ తో కూడిన భారీ హెక్సాగోనల్ గ్రిల్, సీకర్ లుకింగ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లతో కూడిన ఫ్రంట్ బంపర్, 16 అంగుళాల ప్రెసిషన్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రాంక్స్ స్పోర్ట్స్ సిగ్నేచరల్ ఎల్ఈడీ బ్లాక్ టెయిల్ ల్యాంప్స్, ఎస్ యూవీ చుట్టూ ఓ ఎల్ఈడీ స్ట్రిప్ ని పొందుపరిచారు.

ఇంటీరియర్

ఫ్రాంక్స్ కారు లోపల చూస్తే... 9.0 అంగుళాల హెచ్ డీ స్మార్ట్ ప్లే ప్రొ ప్లస్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దీన్ని వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ యాప్ లతో అనుసంధానం చేసుకోవచ్చు. ఈ కారులో ఆర్కామీస్ సౌండ్ సిస్టమ్ ను పొందుపరిచారు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, హెచ్ యూడీ యూనిట్, 360 డిగ్రీ కెమెరాలు, క్రూయిజ్ కంట్రోల్ సదుపాయం కల్పించారు. అంతేకాదు, సుజుకి కనెక్ట్ యాప్ ద్వారా 40కి పైగా అదనపు ఫీచర్లను పొందవచ్చు.

ఇంజిన్

దీంట్లో ప్రోగ్రెసివ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 1.0 లీటర్ కే సిరీస్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ ఉంది. 147 ఎన్ఎమ్ టార్క్ వద్ద 99 హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. మరో వెర్షన్ లో 1.2 లీటర్ కే సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అందిస్తున్నారు. ఇది 113 ఎన్ఎమ్ టార్క్ వద్ద 89 హార్స్ పవర్ అందిస్తుంది. గేర్ సిస్టమ్ చూస్తే... 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 5 స్పీడ్ ఏజీఎస్ ట్రాన్స్ మిషన్, 6 స్పీడ్ ఏఎంటీ వెర్షన్లు ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు

సుజుకి హార్టెక్ట్ ప్లాట్ ఫామ్ పై ఫ్రాంక్స్ కారును నిర్మించారు. డ్రైవర్, కో డ్రైవర్, సైడ్, కర్టెన్ లతో కలిపి 6 ఎయిర్ బ్యాగులు ఏర్పాటు చేశారు. త్రీ పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్టులు, హిల్ హోల్డ్ అసిస్ట్ తో కూడిన ఈఎస్పీ, రోల్ ఓవర్ మిటిగేషన్, ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజి ఫీచర్లు దీంట్లో ఉన్నాయి.

More Telugu News