YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. హైకోర్టు ఉత్తర్వుల కొట్టివేత.. సీబీఐ విచారణ గడువు పొడిగింపు

Disappointment for YS Avinash Reddy in Supreme Court
  • సునీతారెడ్డికి అనుకూలంగా తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
  • టీఎస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం అసంతృప్తి
  • జూన్ 30 వరకు సీబీఐ విచారణ పొడిగింపు

వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. వివేకా కూతురు సునీతారెడ్డికి అనుకూలంగా సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవినాశ్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ గడువును కూడా పొడిగించింది. జూన్ 30 వరకు విచారణ గడువును పొడిగించింది. 

మరోవైపు విచారణ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పింది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సంప్రదాయాలకు దారి తీస్తాయని తెలిపింది.

  • Loading...

More Telugu News