YS Sharmila: వైఎస్ షర్మిలపై చర్యలు తీసుకుంటాం: పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Will take action on YS Sharmila says Police Commissioner CV Anand
  • విధుల్లో ఉన్న పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారన్న సీవీ ఆనంద్
  • సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని ముందే చెప్పామన్న సీపీ
  • ఆపే ప్రయత్నం చేసిన పోలీసులపై దాడి చేశారని వ్యాఖ్య
విధుల్లో ఉన్న పోలీసులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేయి చేసుకున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ క్రమంలో షర్మిలపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. సిట్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని షర్మిలకు ముందే చెప్పామని... అయినా ఆమె పట్టించుకోకుండా వెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఆమెను బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు యత్నించగా వారిపై దాడి చేశారని అన్నారు. షర్మిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ పై షర్మిల తల్లి విజయమ్మ కూడా చేయి చేసుకున్నారు.
YS Sharmila
YSRTP
Police Commissioner
CV Anand

More Telugu News