South Central Railway: ప్రయాణికుల రద్దీ.. హైదరాబాద్-సోలాపూర్ మధ్య నేటి నుంచి ప్రత్యేక రైలు

Special train between Hyderabad and Solapur starts today
  • వచ్చే నెల 14 వరకు అందుబాటులోకి ప్రత్యేక రైలు
  • ఉదయం 6 గంటలకు నాంపల్లిలో బయలుదేరనున్న రైలు
  • బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి మీదుగా ప్రయాణం
  • తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.20 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరనున్న రైలు
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 14 వరకు హైదరాబాద్-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైలును (07003/07004) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్(నాంపల్లి స్టేషన్) నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది.

ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12.20 గంటలకు సోలాపూర్ చేరుతుంది. తిరిగి 1.20 గంటలకు సోలాపూర్‌లో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.

South Central Railway
Hyderabad
Solapur
Special Train

More Telugu News