Punjab Kings: పంజాబ్ కింగ్స్ ఫన్నీ ట్వీట్.. ముంబై పోలీస్ అదిరే రిప్లై!

Punjab Kings Report Crime After Arshdeep Singhs Stump Breaking Show Mumbai Police Respond
  • నిన్నటి హై స్కోరింగ్ మ్యాచ్ లో ముంబై ని ఓడించిన పంజాబ్
  • అర్షదీప్ బౌలింగ్ లో వరుసగా రెండు సార్లు విరిగిపోయిన స్టంప్స్
  • ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ పంజాబ్ టీమ్ ట్వీట్
నిన్న జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ని మట్టికరిపించి.. పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి దాకా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో అర్షదీప్ సింగ్.. రెండు వరుస వికెట్లతో పంజాబ్ గెలుపు ఖాయం చేశాడు. అదిరిపోయే యార్కర్లతో రెండు సార్లు స్టంప్స్ ను విరగ్గొట్టడంతో ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు.  

రెండు సార్లు స్టంప్స్ విరగిపోవడంపై పంజాబ్ కింగ్స్ ఫన్నీగా ట్వీట్ చేసింది. అర్షదీప్ నేరం చేశాడన్నట్టుగా ముంబై పోలీసులను ట్యాగ్ చేసింది. ‘‘హేయ్ ముంబై పోలీస్.. ఓ నేరం గురించి రిపోర్ట్ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొంది. విరిగిపోయిన స్టంప్ ఫొటోను షేర్ చేసింది. ముంబై టీమ్ పై ముంబైలోని వాంఖడే స్టేడియంలోనే గెలవడంతో ముంబై పోలీసులను టీజ్ చేసింది.

దీనికి ముంబై పోలీసులు కూడా అంతే దీటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించడంపై చర్య తీసుకోవచ్చు.. స్టంప్స్ విషయంలో కాదు!’’ అని పేర్కొన్నారు. ఈ ఫన్నీ చర్చపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ‘‘ముంబై పోలీస్.. బాగా చెప్పారు’’ అని ఒకరు కామెంట్ చేశారు.

‘‘భారత పౌరులకు ఆధార్ ఉన్నట్లే.. ఐపీఎల్ జట్లకు ట్రోఫీ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం’’ అంటూ ‘ముంబై పోలీస్’ పేరుతో ఉన్న ఖాతా నుంచి మరొకరు ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా పంజాబ్ టైటిల్ గెలవని విషయాన్ని ఎద్దేవా చేశారు.
Punjab Kings
Mumbai Indians
Arshdeep Singh
Indian Premier League
IPL 2023
mumbai police

More Telugu News