అకాల వర్షాలపై అధికారులతో సీఎం సమీక్ష
- పంట నష్టాన్ని అంచనా వేయాలంటూ కలెక్టర్లకు సూచన
- కలెక్టర్లతో మాట్లాడి నివేదికలు తెప్పించాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశాలు
- ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామని కేసీఆర్ వెల్లడి
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అకాల వర్షాల వలన కలిగిన పంట నష్టానికి సంబంధించి అంచనాలు తయారుచేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలను జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పంట నష్టానికి సంబంధించిన నివేదికలను తెప్పించాలని సీఎం కేసీఆర్ ప్రధాన కార్యదర్శికి సూచించారు.