chalaki chanti: చలాకీ చంటికి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన కమెడియన్!

jabardasth fame chalaki chanti admited into Hospital
  • ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం
  • జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందిన కమెడియన్
  • పలు సినిమాల్లోనూ నటించిన చలాకీ చంటి
చలాకీ చంటిగా జబర్దస్త్ కామెడీ షోలో బుల్లితెర ప్రేక్షకులను అలరించిన కమెడియన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. గుండెనొప్పితో బాధపడుతున్న చంటిని శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చంటిని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చంటి అనారోగ్యంపై అధికారిక సమాచారం లేదు. ఆసుపత్రి వర్గాలు కానీ, ఇటు చంటి సన్నిహితులు కానీ మీడియాకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెరకు పరిచయమైన చలాకీ చంటి పలు సినిమాల్లోనూ నటించారు. సినిమా షూటింగ్ ల కోసం జబర్దస్త్ షో ను విడిచిపెట్టారు. అయితే అప్పుడప్పుడూ షోలో సందడి చేసేవారు. ఆ తర్వాత ‘నా షో నా ఇష్టం’ కార్యక్రమానికి యాంకర్ గా చంటి వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్నా.. చివరి వరకూ పోటీలో ఉండలేక మధ్యలోనే బయటికి వచ్చేశారు. కొంతకాలంగా ఇటు బుల్లితెరపై కానీ అటు వెండితెరపై కానీ చంటి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం చంటి అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.
chalaki chanti
chanti hospitalized
Jabardasth
comedian

More Telugu News