NTR: పోరంకిలో ఎన్టీ రామారావు చారిత్రక ప్రసంగ పుస్తకాల ఆవిష్కరణ.. హాజరుకానున్న రజనీకాంత్

  • ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సిద్ధమవుతున్న విజయవాడ
  • ఈ నెల 28న పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో  పుస్తకాల ఆవిష్కరణ
  • ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌సైట్, యాప్ రూపకల్పన
Super Star Rajinikanth to attend Vijayawada for Late NTR Speeches book release

టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలకు విజయవాడ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 28న పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హాజరవుతారు. ఎన్టీఆర్‌పై తొలి పుస్తకం రాసిన సీనియర్ జర్నలిస్ట్ ఎస్.వెంకటనారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

మే 28న ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజును పురస్కరించుకుని విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం టీడీ జనార్దన్ నేతృత్వంలో సావనీర్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా వెబ్‌సైట్, యాప్‌ను కూడా తీసుకురాబోతున్నారు. ఈ రెండింటి ఆవిష్కరణ కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. 

ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలతో రెండు పుస్తకాలు, ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలతో ఓ పుస్తకం, బయట చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకం తీసుకున్నారు. చారిత్రక ప్రసంగాలు పేరుతో తీసుకొస్తున్న ఈ పుస్తకాలను ఈ నెల 28న పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఆవిష్కరిస్తారు.

More Telugu News