Peethala Sujatha: జగన్ ఓర్వలేక దాడులకు తెగబడుతున్నారు: పీతల సుజాత

Peethala Sujatha fires on Jagan
  • ఏపీలో చంద్రబాబుకే రక్షణ లేదన్న సుజాత
  • జగన్ దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ మండిపాటు
  • దళితులు వైసీపీకి దూరమవుతున్నారని వ్యాఖ్య

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే రక్షణ లేకపోతే... సామాన్యుడి పరిస్థితి ఏమిటని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే సీఎం జగన్ దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. దళితులందరూ వైసీపీకి దూరమవుతున్నారని అన్నారు. సీఎంగా ఉన్న జగన్ దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వైసీపీ మంత్రులకు అర్ధనగ్న ప్రదర్శన ఫ్యాషన్ గా మారిందని అన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని మంత్రి ఆదిమూలపు సురేశ్ తాడేపల్లి ప్యాలెస్ లో తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సురేశ్ ను చూసి దళితులు సిగ్గుపడుతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News