KTR: కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

Invitation for KTR for another international progmramme
  • దుబాయ్ లో ప్రపంచ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సు
  • జూన్ 7, 8 తేదీల్లో జరగనున్న కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా కేటీఆర్ కు ఆహ్వానం
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. దుబాయ్ లో జరిగే ప్రపంచ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. దుబాయ్ లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదికగా జూన్ 7, 8 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధిని సాధించిందని... ఈ సమావేశంలో కేటీఆర్ వంటి నాయకులు పాల్గొనడం వల్ల సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల దుబాయ్ ఎంతో మేలు కలుగుతుందని ఆ దేశం భావిస్తోంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరు కావడం వల్ల భారత దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడికి వెళ్లిన టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని కలగజేస్తుందని ఆహ్వానంలో పేర్కొన్నారు.
KTR
BRS
Dubai

More Telugu News