KA Paul: రండి... స్టీల్ ప్లాంట్ ను కొందాం: రాజకీయ పార్టీలకు కేఏ పాల్ పిలుపు

KA Paul calls for political parties to buy Vizag Steel Plant
  • ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో కేఏ పాల్ ప్రెస్ మీట్
  • చర్చనీయాంశంగా మారిన ఇరువురి కలయిక
  • నేడు నర్సీపట్నంలో ఉన్న తండ్రిని పరామర్శించేందుకు వచ్చిన పాల్
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనే శక్తి తనకు మాత్రమే ఉందని వెల్లడి 
ఇటీవల సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణతో కలిసి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రెస్ మీట్ పెట్టడం ఎంతో చర్చనీయాంశం అయింది. లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి కేఏ పాల్ తో కలవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

కాగా, కేఏ పాల్ ఇవాళ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న తండ్రిని పరామర్శించేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనే శక్తి తనకు మాత్రమే ఉందన్నారు. రండి... విశాఖ స్టీల్ ప్లాంట్ ను మనమే కొందాం అని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. 

తాను ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగానని, స్టీల్ ప్లాంట్ ను దక్కించుకోవడం కేసీఆర్ వల్ల కాదని కేఏ పాల్ అన్నారు. సింగరేణిని కాపాడుకోలేని కేసీఆర్, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొంటాడా? అని వ్యంగ్యం ప్రదర్శించారు. తనను ఏపీ సీఎంని చేస్తే అమరావతి పూర్తి చేస్తానని తెలిపారు.
KA Paul
Vizag Steel Plant
Andhra Pradesh

More Telugu News